విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : పదోతరగతి పరీక్షల మార్చి2026 షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్టు అధికారులు శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 16న ఫస్టు లాంగ్వేజ్ పరీక్ష (గ్రూప్`ఏ), 18న ద్వితీయ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అనేక సూచనలు చేశారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగిలిన అన్ని పేపర్లు 100 మార్కులకు ఉంటాయి. 9 రోజుల పాటు జరగనున్న పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్న మైంది. పది పరీక్షలకు విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ సన్నద్ధు లు చేయాలని బోర్డు ఆదేశించింది. పది పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.
మార్చి 16 నుంచి పది పరీక్షలు
- Advertisement -
RELATED ARTICLES


