భారత్‌కు సుంకాల భారంపై అమెరికా
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల భారాన్ని మోపారు. శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు న్యూదిల్లీపై ట్రంప్ సుంకాలు విధించారన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అధ్యక్షుడు నిశ్చయించుకున్నారన్నారు. రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకొని దానిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారని, అది ట్రంప్ పరిపాలన వ్యూహమని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన విషయాన్ని గుర్తుచేశారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్ నాయకులతో చర్చలే యుద్ధం ముగింపునకు తొలి అడుగుగా అభివర్ణించారు. ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. ట్రంప్ అధికారంలో ఉంటే అసలు యుద్ధం వచ్చేదే కాదన్నారు. పుతిన్ కూడా ఇదే చెప్పారని ఆమె తెలిపారు. భారత్-పాక్ యుద్ధాన్ని ట్రంప్ ముగించారని మళ్లీ చెప్పారు.


