Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రభుత్వ లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు మధ్య ఎస్సై అంత్యక్రియలు


విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : తెలంగాణ రాష్ట్రంలో నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నంద్యాల జిల్లా ఎస్సై మరియు అనంతపురం వాసి అయిన నంబూరి వెంకట రమణ అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య గురువారం ముగిశాయి. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఎస్సై ఎన్వీ రమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడి భార్య శ్రీవాణి, కూతురు అనూషలను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఎస్పీ భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రం భూత్పూర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై ఎన్వీ రమణ, అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్రశేఖర్ లు చనిపోయారు. వీరిలో ఎస్సై మృతదేహాన్ని స్థానిక రామచంద్రనగర్ లో ఉన్న ఆయన స్వగృహానికి ఈరోజు తీసుకొచ్చారు. 1989 సంవత్సరంలో ఇతను జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా చేరాడు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎస్సైగా పదోన్నతి పొందాక నందికొట్కూరు పోలీసు స్టేషన్లో ఆతర్వాత రాచర్ల ఎస్ హెచ్ ఓ గా పని చేస్తున్నారు. సౌమ్యుడు, వివాద రహితుడు. అనంతపురంలోని తన స్వగృహంకు తీసుకొచ్చిన ఎస్సై మృతదేహాన్ని ఎస్పీ గారు సందర్శించారు. మృతదేహంపై పూలగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని గార్లదిన్నె మండలం మర్తాడు సమీపంలోని సొంత తోటకు తీసికెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పిటిసి అదనపు ఎస్పీ జె.మల్లికార్జునవర్మ, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, పలువురు సి.ఐ లు, ఎస్సైలు, బ్యాచిమేట్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img