Saturday, November 30, 2024
Homeతెలంగాణఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ అభివృద్ధి
. సోనియమ్మ లేకుంటే తెలంగాణ లేదు
. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే… చర్చకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అడబిడ్డలు మనసు నిండుగా తనను ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. మంగళవారం వరంగల్‌ లో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజా కవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వర్చువల్‌ విధానంలో వరంగల్‌ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం… వరంగల్‌ లో కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌ను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు మాహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడిరచి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్‌ జెండాను ఎగరేసింది మన ఆడబిడ్డనే అంటూ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి ఉన్నారని, ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టాటా బిర్లాలను తలదన్నేల రాష్ట్రంలో ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా ప్రభుత్వం తీర్చిదిద్దబోతోందని పేర్కొన్నారు. ‘మేం నిర్మిస్తే మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారని ఒకాయన మాట్లాడుతుండు కానీ కాళొజీ కళాక్షేత్రం పదేళ్లుగా పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడిరది. మీరు పూర్తిచేయలేదు కాబట్టే మేం కాళోజీ కళాక్షేత్రంను పూర్తి చేశాం’ అని రేవంత్‌ చెప్పారు. వరంగల్‌ గడ్డపై రైతు డిక్లరేషన్‌ తో తెలంగాణలో కాంగ్రెస్‌ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. చారిత్రాత్మక వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌ కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వరంగల్‌ అభివృద్ధికి దాదాపు రూ.ఆరువేల కోట్లు కేటాయించామన్నారు. వరంగల్‌ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లే అన్నారు. వరగంల్‌ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదని చెప్పారు. ‘మీరు కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చు కానీ మీ కుట్రలను గుర్తించి ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని బీఆర్‌ఎస్‌ నాయకులను ఉద్దేశించి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ… పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతుండు కానీ వాస్తవానికి పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారని, అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారని అన్నారు. పది నెలల్లో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారు. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పొందారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతీ పేద కుటుంబం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందుతోందని చెప్పారు. ‘పదినెలల్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగం కోల్పోయారు తప్ప ఇంకేమీ కాలేదని… ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 22లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం’ అని చెప్పారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన వ్యక్తి కేసీఆర్‌ అని కానీ నేడు రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం రైతులు పండిరచారని వెల్లడిరచారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో వరి ధాన్యం పండిరచలేదన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే దేనిపై అయినా చర్చించేందుకు సిద్ధమని.. ఆయన ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాలని సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తూ … కేటీఆర్‌ మాట్లాడగానే రెండోరోజు కిషన్‌ రెడ్డి మాట్లాడుతడని నేను సోనియమ్మకు గులాం అని కిషన్‌ రెడ్డి మాట్లాడుతుండు కానీ అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తల్లి సోనియమ్మ అనే విషయం ఆయన గుర్తు పెట్టుకోవలన్నారు. సోనియమ్మ మా అమ్మ,…. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ… అలాంటి ఆ తల్లి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా మేం సిద్ధమే అన్నారు. ఇది మాకు అవమానం కాదు.. ఆత్మ గౌరవంగా పేర్కొన్నారు. ఆ తల్లి లేకుంటే తెలంగాణ ఉండేది కాదని, కిషన్‌ రెడ్డి సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటే… మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుందన్నారు. తెలంగాణను అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ అని, ఆయనకు గులాంగా మారిన వారికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు