నిర్లక్ష్యం వద్దు… గెలుపే లక్ష్యం: సీఎం రేవంత్ పిలుపు
విశాలాంధ్రహైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఒక్కటిగా పనిచేద్దామంటూ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొద్దిపాటి నిర్లక్ష్యం... చిన్నపాటి తప్పు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంటింటి పచారం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి గతనెల 31న, ఈనెల 1, 4, 5 తేదీల్లో నియోజక వర్గంలోని కొన్ని డివిజన్లలో రోడ్డుషోలు, సభలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, వ్యూహాలు ప్రతివ్యూహాలు తదితర అంశాలపై సమీక్ష రేవంత్ సమీక్షించారు. మంత్రులందరికి బాధ్యతలు అప్పగించారు. ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


