Sunday, March 16, 2025
Homeసాహిత్యంఒక మహోత్సవం

ఒక మహోత్సవం

జీవన పరిణామ క్రమంలో
పెట్రో మాక్స్‌ బిజిలీ వంటి
మజిలీ వృద్ధాప్యం
శాపగ్రస్త కాదు
గొంగళిపురుగు కోశస్త స్థితిలోంచి
ఎగిరి వచ్చిన సీతాకోకచిలుక
ఎవరో ప్రసాదించిన వరమూ కాదు
మిగుల పక్వానికి వచ్చిన
చెట్టు మీది పండు
అనుభవాల ఓండ్రు మట్టి
ఊసర క్షేత్రం అనుభవాల ఒండ్రు మట్టి
సారవమైన భూమి తల్లి
మంద్రంగా పారుతున్న నది
ఆనకట్ట అయి పోయి
కాలువగా పొలాల వైపు పరుగెత్తడం
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు
ఎవరు మాటల రాయి విసిరినా
ఓర్చుకొని ఫలాలను పంచుతుంది
పరిగెత్తి పాలు తాగడం కాదు
నిలబడి రెండు దోసెలతో దూసిళ్లతో
అనంత దాహం తీర్చుకోవడం
చేతి కర్ర సమాజానికి ఊతం
కళ్లద్దాలు దృక్కోణానికి రూపం
నిలువెత్తు నికాల్సైన వ్యక్తిత్వం
మీరు వెతుక్కోగలిగితే
అతడు నడిచి వచ్చిన దారంతా
అడుగుజాడలు దొరుకుతాయి
మండే ఎండ జడివాన నుంచి
నీకు గొడుగు పడుతుంది
పుండు పుండు చలి నుంచి
నిన్ను గొంగడై కాపడం పెడుతుంది
గాయాలు తనలో ఉంచుకొని
ఎలుగెత్తి గేయాలు పంచుతుంది
ఎడారి జీవన యాత్రలో
చల్లని పరిణత ఓయాసిస్‌
ఛౌరస్తాలో స్తంభంపై నుంచి
ఎత్తి పట్టి దారి చూపే
లాంతరు కాంతి మహోత్సవం
గాయాలు తనలో లోన ఉంచుకొని
ఎలుగెత్తి గేయాలు పంచుతుంది
అనేక శారీరక ఆరోగ్య సమస్యలున్నా
ఒక ఆరోగ్య సమాజం కోసం
ఆరోగ్య సమాజం కోసం
కళ్ళల్లో వత్తులు వేసుకొని సాధడం
-జూకంటి జగన్నాథం

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు