Homeసాహిత్యంజీవన వ్యాకరణం…

జీవన వ్యాకరణం…

- Advertisement -

ఆప్యాయతతో ముడివేసే
అమ్మతనం భాష
ప్రతి హృదిలో పరిమళించే కమ్మదనం భాష
హృదయాంతరాళాలు పలికే
శబ్దశక్తి భాష, విద్వత్తు భాష
విద్యుత్తేజ రూపమే భాష
నిత్యచైతన్యం భాష
సమత భాష, సద్విమర్శ భాష
మనిషికి దారిదీపం భాష
మాండలిక పరిమళం భాష
జీవన వ్యాకరణం భాష
జనహితమే తన మతమైనది భాష
వ్యవహర్తల కీర్తిపత్రం భాష
సంస్కృతికి తోరణం భాష
సంప్రదాయాల సంపన్నరూపం భాష
అజరామరమైన ఆత్మతేజం భాష
డా. తిరునగరి శ్రీనివాస్‌, 9441464764

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు