Saturday, March 14, 2026
Homeపలస్తీనాకు అండగా నిలుద్దాం

పలస్తీనాకు అండగా నిలుద్దాం

- Advertisement -

17న జాతీయ సంఫీుభావ దినం జయప్రదం చేద్దాం: వామపక్షాల పిలుపు

న్యూదిల్లీ: గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని వామపక్షాలు ఐక్యంగా ఖండిరచాయి. పలస్తీనా ప్రజలకు సంఫీుభావంగా ఈనెల 17న జాతీయ సంఫీుభావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని శాంతివాదులు, ప్రజాస్వామ్యలౌకిక శక్తులకు పిలుపునిచ్చాయి. 17వ తేదీ ఉదయం 11 గంటలకు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా జరుగుతుందని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ), రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబి, దీపాంకర్‌ భట్టాచార్య, జి.దేవరాజన్‌, మనోజ్‌ భట్టాచార్య సంయుక్త ప్రకటనలో తెలిపారు. ‘ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలు, మారణ హోమాన్ని ఖండిద్దాం. దేశ హోదా, సార్వభౌమత్వం, స్వాతంత్య్రం కోసం పలస్తీనా ప్రజల న్యాయ పోరాటానికి సంపూర్ణ మద్దతిద్దాం’ అని పిలుపునిచ్చారు. పలస్తీనా విషయంలో సైద్ధాంతిక వైఖరిని భారత్‌ కలిగివుండాన్ని గుర్తుచేస్తూ... ఇందుకు కట్టుబడాలని మోదీ ప్రభుత్వానికి సూచించారు. ఇజ్రాయిల్‌కు సైనిక, భద్రతాపరమైన సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణ, మారణహోమానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని, పలస్తీనా ప్రజలకు సంఫీుభావం తెలపాలని, జాతీయ సంఫీుభావ దినాన్ని జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు, లౌకికప్రజాస్వామ్య వర్గాలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు