- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాలే వీధిలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లికి ఆషాడమాసం సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేష్ శర్మ వివిధ రకాల చీరలతో ప్రత్యేక అలంకరణ గావించారు. అనంతరం విశేష పూజలతో పాటు అర్చనలు నిర్వహించారు. భక్తాదుల పేరిట విశేష పూజలు కూడా నిర్వహించి, అమ్మవారి మహిమలను తెలియజేశారు. ఈ కార్యక్రమం బుగ్గ వంశస్తుల ద్వారా నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. తదుపరి మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని మా ఆలయంలో ప్రతిసారి నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో పెద్ద ఎత్తున మహిళలు, భక్తాదులు పాల్గొన్నారు.


