- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; వైయస్సార్సీపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ మున్సిపల్ విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వైఎస్సార్సీపి పార్టీ నాయకుడు, కౌన్సిలర్ అయిన చందామూరి నారాయణరెడ్డి నీ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం వైయస్సార్సీపీ పార్టీ శ్రేణులు చందమూరి నారాయణరెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.


