Sunday, March 15, 2026
Homeజాతీయంఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలి

- Advertisement -


: రామ్మోహన్ నాయుడు
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇటీవల 15 పేజీల నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం తగదు అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తుది నివేదిక వచ్చే వరకు అధికారాలు, ప్రజలు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.భారత పైలట్లు ప్రపంచంలోనే అత్యుత్తములు అని కొనియాడారు. విమానయాన రంగం వారి శ్రమపైనే ఆధారపడి ఉందని, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆగిపోయినట్లు నివేదికలో పేర్కొంది.పైలట్ల మధ్య సంభాషణ నివేదికలో నిక్షిప్తమైంది.
ఈ ఘటనలో అనేక సాంకేతిక అంశాలు ఉన్నాయని, అవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.తుది నివేదిక అనంతరం మాత్రమే పూర్తిస్థాయిలో స్పందన ఇవ్వడం సమంజసం అవుతుందని వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు