. హార్దిక్ పాండ్యా షాట్‌కు కిందపడ్డ బౌలర్
. నేడు దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్
శ్రీలంక x ఇంగ్లండ్
మద్యాహ్నం 3 గంటలకు
ఇండియా x సౌతాఫ్రికా
రాత్రి 7 గంటలకు
ముంబై: భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా షాట్‌కు తన సహచరుడు మహమ్మద్ సిరాజ్‌కు గాయమైంది. ప్రాక్టీసులో పాండ్యా కొట్టిన షాట్ అతని మోకాలికి తగిలింది. భారతజట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌లో పాల్గొనాల్సిన భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంది. ప్రాక్టీసు సెషన్లో ఉంది. టీమిండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే ఇది కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్ బెర్త్ వైపు అడుగు వేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు, భారత్‌కు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా అనేక అనారోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నది. జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా ఒక్కొక్క మ్యాచ్‌కు దూరమయ్యారు. వాషింగ్టన్ సుందర్ కూడా మైదానం నుండి నిష్క్రమించారు. టీ20 ప్రపంచ కప్‌కు ముందు హర్షిత్ రాణా గాయం కారణంగా అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ సిరాజ్‌కు ఆలస్యంగా పిలుపువచ్చింది. సిరాజ్ అమెరికాతో జరిగిన ఇండియా తొలి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇప్ప్పుడు ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్ కారణంగా అతని ఎడమ మోకాలికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ సంఘటన తర్వాత మహమ్మద్ సిరాజ్ నొప్పితో బాధపడ్డాడు. అతను నెట్స్ నుండి కూడా బయటకు వచ్చినట్లు కన్పించాడు. సిరాజ్ ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అది కూడా అమెరికాతో. ఇతర మ్యాచ్‌లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్‌లకు టీమ్ మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఇచ్చింది.
మ్యాచ్ వివరాలు
తేదీ: 22 ఫిబ్రవరి 2026 (ఆదివారం)
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.
సమయం: రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ 6:30 గంటలకు ఉంటుంది.
ప్రత్యేకత: 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో తలపడటం ఇదే మొదటిసారి. గ్రూప్ స్టేజ్‌లో భారత్ అజేయంగా నిలిచి సూపర్-8కు చేరుకుంది.
టీమిండియా తుది జట్టు (అంచనా): ఓపెనర్లుః ఇషాన్ కిషన్ (కీపర్), అభిషేక్ శర్మ
మిడిల్ ఆర్డర్: తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి (స్పిన్నర్)
పిచ్ రిపోర్ట్:
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే పొడి పిచ్ అయితే కులదీప్ యాదవ్ అదనపు స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అతను వస్తే వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం కావచ్చు.


