బెంగళూరు’ ఫోన్పే తన ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త ‘టాక్స్ ఫైలింగ్’ ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారాల కోసం ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేయడానికి ఫోన్పే ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా కోట్లాది మంది ఫోన్పే వినియోగదారులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) సులువుగా ఫైల్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెలా జీఎస్‌టీ అవసరాలను యాప్ విశ్వసనీయమైన వ్యవస్థ ద్వారా నేరుగా నిర్వహించుకోవచ్చు. భారతదేశపు అగ్రగామి డిజిటల్ టాక్స్ కంప్లయన్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన టాక్స్బడ్డీ భాగస్వామ్యంతో ఈ సేవలను ఫోన్పే అందిస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ.24లకే సొంతంగా సులభంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. క్లిష్టమైన ట్యాక్స్ ప్రక్రియల కోసం నిపుణుల సహాయం, చిన్న వ్యాపారుల కోసం నెలవారీ జీఎస్‌టీ ఫైలింగ్ వంటి సర్వీసులు ఒకే చోట లభిస్తాయి. ఇతర బాహ్య వెబ్‌సైట్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఐటీఆర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి నిపుణుల మద్దతును, నిరంతర జీఎస్‌టీ ఫైలింగ్ సాధనాలను ఈ యాప్ అందిస్తోంది. రోజువారీ పేమెంట్స్, ఇతర ఆర్థిక అవసరాలతో పాటుగా దీనిని కూడా చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సరికొత్త సేవల ప్రారంభం గురించి ఫోన్పే ఇన్`యాప్ కేటగిరీస్ హెడ్ నిహారికా సైగల్ మాట్లాడుతూ, ట్యాక్స్ నిపుణుల సలహాలను, సరసమైన ధరల్లో టాక్స్ ఫైలింగ్ పరిష్కారాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉద్యోగుల నుండి గల్లీలోని చిన్న వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కరూ తమ ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభంగా, విశ్వాసంతో నిర్వహించుకునేలా చేయడమే మా లక్ష్యమని అన్నారు.


