తీర్థంకర మిత్రా
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ముస్లింలపై ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వేధింపులు తన ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ ఆయుధంగా మారాయి. ముస్లింలపై జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుత ఈ ఎన్నికల సీజన్లో కాషాయ దళానికి వ్యతిరేకంగా భాషా ఉగ్రవాద ఆరోపణలను ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఊరేగింపులు సర్వసాధారణం, రాజధాని నగరాన్ని ఒకప్పుడు ప్రధానమంత్రి ‘‘ప్రదర్శనల నగరం’’గా సంభోదించారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం బోల్పూర్లో నిర్వహించిన ‘‘భాషా ప్రదర్శన’’ ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ ర్యాలీలో గణనీయమైన సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వాస్తవానికి ఇది ఎన్నికల ర్యాలీగా ప్రకటించనప్పటికీ, 2026లో జరిగే శాసనసభా ఎన్నికలకు సన్నద్ధంగా జరిగిన ర్యాలీగా చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన బెంగాలీ మాట్లాడే కార్మికులను బంగ్లాదేశీయులుగా ముద్రవేయడాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శన జరిగింది, బెంగాలీ భాషపై పక్షపాతం ఉందని ఆరోపిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.
ఎప్పుడూ భావోద్వేగ సమస్యగానే ఉన్న బెంగాల్లో భాషను ఎన్నికల అంశంగా మార్చడంలో టీఎంసీ అధినేత్రి చాకచక్యమైన రాజకీయ చర్యను చేపట్టారు. అత్యాచారాలు, హత్య సంఘటనలు, టీచరు పోస్టుల కుంభకోణంలో పీకలలోతు మునిగిపోయి విమర్శల జడివానలో తడిసిపోతున్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ముస్లింలపై ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వేధింపులు తృణమూల్‌కు జీవనాధారంగా మారాయి. ‘‘భాషా ఉగ్రవాదం’’ నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ‘‘ద్వితీయ భాషా ఆందోళన్’’ (ద్వితీయ భాషా ఉద్యమం)కు నాయకత్వం వహిస్తానని మమతా బెనర్జీ చేసిన ప్రకటన బెంగాలీ ఓటర్ల హృదయానికి దగ్గరగా ఉంది. వాస్తవానికి, 2019 ఎన్నికలలో టీిఎంసీికి మద్దతు ఇవ్వని చాలా కుటుంబాలు ఇతర రాష్ట్రాలలో దాడులకు గురవుతున్న బెంగాలీ మాట్లాడే వలస కార్మికుల కోసం పోరాడే అంశంపై ముఖ్యమంత్రికి ఇప్పుడు మద్దతిస్తున్నాయి. తనంతట తాను ఆలోచించే సామర్థ్యాన్ని నిరూపించుకున్న మమతా బెనర్జీ, ప్రస్తుత బంగ్లాదేశ్‌లో తమ మూలాల గురించి గర్వపడే చాలా మంది సీనియర్ సిటిజన్ల హృదయాల్లో భావోద్వేగాన్ని రేకెత్తిస్తున్నారు. కానీ అలాంటి గర్వం వారు భారత పౌరులని, 2026 ఎన్నికలలో టీఎంసీకి తమ మద్దతుకు హామీ ఇస్తారని ఒక్క క్షణం కూడా మర్చిపోయేలా చేయదు. ఈ విషయమై మమత ఆరోపణలను తోసిపుచ్చలేం. రాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులను బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులుగా లక్ష్యంగా చేసుకుని, వేధించి, బలవంతంగా బహిష్కరించారు.
ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలలో ఇటువంటి సంఘటనలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో భాషా ఉగ్రవాదం అనే మమత ఆరోపణకు మద్దతు పెరుగుతోంది. ఈ రాష్ట్రాలన్నీ బీజేపీి పాలనలో ఉండటం టీిఎంసీి అధినేత్రి వ్యాఖ్యలకు మరింత ఊతం లభిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (హెచ్ఆర్ఓ) అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మానవ హక్కుల సంస్థ దీనిని గమనించడంతో బలవంతపు బహిష్కరణ సమస్య భారతదేశ సరిహద్దులను దాటి ప్రపంచ సమస్యగా పరిణమించింది. ఈ సంఘటనపై హెచ్ఆర్ఓ అభిప్రాయం తన రాజకీయ ప్రత్యర్థిని బాధపెట్టే చోట కొట్టడానికి అవకాశాన్ని వదులుకోవడానికి అసహ్యం కలిగిస్తోందని మమతా బెనర్జీ తన వాణి వినిపించారు. పశ్చిమ బెంగాల్ నేల పుత్రులను హింసించే సాధనంగా భాషను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాషాయ శిబిరంలో ఒక మోస్తరు నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలు అర్ధరహితంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిరసన ప్రదర్శనకు మమత ఎంపిక చేసుకున్న వేదిక చాలా బాగుంది. శాంతినికేతన్ పక్కనే ఉన్న బోల్పూర్ను ఎంచుకోవడంలో టీఎంసీ అధినేత్రి తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీకి వ్యతిరేకంగా ఆమె ప్రచారాన్ని ప్రారంభించడానికి ఇది సరైన ప్రదేశం.
చేతిలో ఠాగూర్ చిత్రంతో ‘‘భాషా ప్రదర్శన’’కు మమత నేతృత్వం వహించారు. దాదాపు 2.5 కిలోమీటర్లు ఈ ర్యాలీలో నడిచి తన మాటలను కార్యరూపంలోకి తెచ్చారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు తమ తలల చుట్టూ ‘‘ఆమ్రా బంగాలి, బంగ్లాదేశీ నోయి’’ (మేము బెంగాలీలం, బంగ్లాదేశీయులం కాదు) అనే పూలదండలు ధరించి తమ నేతను అనుసరిస్తూ నడిచారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల కమిషన్‌తో చేతులు కలిపిందని తృణమూల్ చీఫ్ ఆరోపించారు. చాలా మందిపై ఈ అంశం ప్రభావం చూపింది. పౌరులుగా రుజువు చేసుకోవడానికి ఆధార్, ఓటరు కార్డులు కాకుండా ఇతర పత్రాలను అందించడానికి తొందరపడకూడదని రాష్ట్రంలో చాలా మంది పౌరులు నిర్ణయించుకున్నారు. ఇటువంటి అయిష్టత టీఎంసీకి ఎంతో లాభదాయకం. 2026 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో తృణమూల్ పాలన కొనసాగింపునకు వారి మద్దతును నిర్ధారించడంలో ఇది చాలా సహాయపడుతుంది.
తృణమూల్ అధినేత్రి దాడితో కాషాయ శిబిరం కకావికలం అయింది. ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంది. భాషా అంశంపై తృణమూల్‌ను ఎలా ఎదుర్కోవాలో అని బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. బెంగాలీ వలసదారుల వేధింపులను రాజకీయ దృష్టితో చూడటం తమకు ప్రమాదకరంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన సమిక్ భట్టాచార్యకు బాగా తెలుసు. భాషా ఉగ్రవాదం అనే టీఎంసీి ఆరోపణను ఎదుర్కోవడానికి ఆయన మానవతావాద ఆలోచనతో అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.


