హైదరాబాద్: వినియోగదారులు సులభంగా ట్రేడిరగ్ చేసుకునేందుకు వీలుగా యూజర్ ఫ్రెండ్లీ ట్రేడిరగ్ యాప్ ‘అగ్నిక్’ను ప్రవేశ పెట్టినట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ హోల్‌టైమ్ డైరెక్టర్ సీఏ జషన్ అరోరా తెలిపారు. ఈ యాప్ ట్రేడిరగ్, ఇన్వెస్టింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. భారతదేశ రిటైల్ ఇన్వెస్టర్ బేస్ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లలో 52 శాతం వృద్ధి నమోదైందన్నారు. అగ్నిక్ ఈ డిమాండ్‌కు సంపూర్ణంగా ఉపయోగపడుతుందని తెలిపారు. టెక్ అవగాహన ఉన్న పెట్టుబడిదారులు, వ్యాపారుల కోసం రూపొందించబడిరదని పేర్కొన్నారు. అగ్నిక్‌లో అధునాతన మార్కెట్ స్క్రీనర్‌లు, వాచ్‌లిస్ట్‌లు, పెట్టుబడి కోసం స్క్రిప్ సమాచారం ఉంటుందన్నారు. నయా పెట్టుబడిదారుల కోసం అగ్నిక్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓలు, స్టాక్ సీప్లలో వివిధ రకాల పెట్టుబడి కోసం పేపర్‌లెస్ ఈకేవైసీ ప్రక్రియ ద్వారా ఉచిత డీమ్యాట్ ఖాతాను తెరిచే సౌలభ్యం కలదన్నారు.