Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంరష్యాకు మద్దతుగా పాక్‌, చైనా కిరాయి సైనికులు

రష్యాకు మద్దతుగా పాక్‌, చైనా కిరాయి సైనికులు

- Advertisement -

జెలెన్‌స్కీ ఆరోపణ
కీవ్‌: రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ కీలక ఆరోపణలు చేసింది. తమ దళాలు మాస్కో సైనికులతో పాటు పాకిస్థాన్‌, చైనాకు చెందిన కిరాయి సైనికులతో పోరాడాల్సి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ ఆరోపణలను పాకిస్థాన్‌ ఖండిరచింది. వోవ్‌చాన్స్క్‌ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్‌స్కీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఫ్రంట్‌లైన్‌లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్‌ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బ్రిగేడ్‌లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడిరచారు. చైనా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకిస్థాన్‌ సహా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు తమ దళాలు గుర్తించాయన్నారు. దీనికి తమ ప్రతిస్పందన గట్టిగా ఉంటుందన్నారు. యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, జెలెన్‌స్కీ ఆరోపణలను పాక్‌ తీవ్రంగా ఖండిరచింది. జెలెన్‌స్కీవి నిరాధార ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు కీవ్‌ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో మాస్కో తరపున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలో జెలెన్‌స్కీ ఆరోపించిన సంగతి తెలిసిందే. వీటిని బీజింగ్‌ అప్పుడే ఖండిరచింది. మరోవైపు… ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. అందులోభాగంగా భారీ సంఖ్యలో సంప్రదాయ ఆయుధాలను, 10-12 వేల మంది వరకు బలగాలను పంపిందని పాశ్చాత్య మీడియా గతంలో వెల్లడిరచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు