Homeఅంతర్జాతీయంవిదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ

విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ

- Advertisement -

పారిస్: పశ్చిమాసియాలో ఇంధన కేంద్రాలపై దాడుల క్రమంలో చమురు సంక్షోభం మరింత పరిగే పరిస్థితుల్లో అంత ర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) శుక్రవారం కొన్ని ప్రతిపాదనలు చేసింది. విదేశీ ప్రయాణాలు నివారించాలని, ఇంటి నుంచి పని సౌకర్యం కల్పించాలని సూచనలు చేసింది. తద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో చమురు ధరలపై ఒత్తిడిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ముడి చమురు ధరల పెరుగుదలతో వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు ఐఈఏ ఈనెల 11న ఆమోదించింది. ఈ నిల్వలో అధిక భాగం అమెరికాకు వెళ్లనుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇబ్బందులు తగ్గించేలా ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలను ప్రభుత్వాలు, వ్యాపారులు, గృహ వినియోగదారులకT చేస్తున్నట్లు ఐఈఏ వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్, వాహనాల వేగాన్ని గంటకు 10కి.మీకు తగ్గించడం, విమాన ప్రయాణాలు నివారించడం వంటివి సూచించింది. అంతర్జాతీయ ఇంధన దౌత్యంలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన ఉత్పత్తిదారులు`వినియోగదారులతో సహా కీలక ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. ఈ సంక్షోభం నివారణకు తక్షణమే నిర్దిష్టమైన చర్యలను తీసుకోవాలని ఐఈఏ పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు