Saturday, March 14, 2026
Homeవిశ్లేషణవియత్నాంకు సుంకం తగ్గింపుభారత్‌కు ఎదురుదెబ్బ

వియత్నాంకు సుంకం తగ్గింపుభారత్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -


సుబ్రతా మజుందర్‌

జులై 9, 2025 న వియత్నాం నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం ప్రాథమిక సుంకాన్ని 45 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇది భారత్‌పై విధించిన దిగుమతి సుంకాల కంటే తక్కువ. తాజాగా వియత్నాం వస్తువులపై ట్రంప్‌ 40 శాతం సుంకాన్ని విధించిన విషయ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం వియత్నాం ద్వారా వస్తువులను అమెరికాకు సరఫరా చేయడంలో చైనా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ట్రాన్స్‌షిప్పింగ్‌లో (ఒక ఓడ నుంచి మరో ఓడలోకి మార్చడం) భాగంగా వస్తువులపై అసలు విలువ జోడిరచకుండా అమెరికా మార్కెట్‌కు వియత్నాం నుంచి రీలేబుల్‌ చేసి తిరిగి ఎగుమతి చేయడం తద్వారా దిగుమతి సుంకాల నివారణతోపాటుగా ఉత్పత్తి చేసే దేశాన్ని దాచిపెట్టడానికి ఇది తరచుగా జరుగుతున్నదే..
అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్‌ లుట్నిక్‌ అమెరికా మార్కెట్లో చైనా వస్తువులపై 55 శాతం సుంకాన్ని విధిస్తోంది. ఇందులో భాగంగా 2025 మార్చి 4 నుంచి ప్రపంచవ్యాప్తంగా బేస్‌లైన్‌ సుంకం 10శాతం, 20 శాతం ‘‘ఫెంటానిల్‌’’ సుంకం, అమెరికా సెక్షన్‌ 301 కింద 25 శాతం సుంకం ఉన్నాయి. వియత్నాం ద్వారా అమెరికాకు ఎగుమతి చేసే చైనా వస్తువుల ట్రాన్స్‌షిప్‌మెంట్‌పై స్పష్టత లేనప్పటికీ, చైనా గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా వియత్నాంకు చైనా అతిపెద్ద ఎగుమతిదారు. వియత్నాం మొత్తం దిగుమతిలో దాదాపు 33 శాతం వాటా చైనాదే. అమెరికాకు ఎగుమతి చేసే విద్యుత్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, దుస్తులు, ఔషధాలు, యంత్రాలు వంటివి వియత్నాం తుది ఉత్పత్తులలో చైనాదే అతిపెద్ద్ద వాటా. ముఖ్యంగా అమెరికాకు వియత్నాం ఎగుమతుల్లో విద్యుత్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడి భాగాలు. ప్రధానమైనవి. 2024లో అమెరికాకు వియత్నాం ఎగుమతుల్లో దాదాపు మూడిరట ఒక వంతు (29.9 శాతం) ఇవి ఉన్నాయి.
వియత్నాంకు సరఫరా గొలుసులో చైనా ప్రముఖపాత్ర పోషిస్తోంది. అమెరికాకు విద్యుత్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని చైనా ట్రాన్స్‌షిప్‌మెంట్‌లో కీలకపాత్ర వహిస్తోంది. అదేవిధంగా, అమెరికాకు వియత్నాం దుస్తుల ఎగుమతులపై క్లిష్ట పరిస్థితి నెలకొంది. అమెరికాకు చైనా, వియత్నాం ప్రధాన దుస్తుల ఎగుమతిదారులు. అయితే, చైనా ఎగుమతులు ఇటీవల కాలంగా భారీగా తగ్గాయి. 2024లో వియత్నాం అమెరికాకు అతిపెద్ద దుస్తుల ఎగుమతిదారు. 2024లో అమెరికా దుస్తుల దిగుమతుల్లో దాదాపు 42.2 శాతం వియత్నాం ఉత్పత్తులే. వియత్నాంలో తయారయ్యే దుస్తుల తుది ఉత్పత్తిలో గణనీయమైన భాగం చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రాల మూల పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. 2018లో అమెరికాచైనా వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వియత్నాం అమెరికాకు తన ఎగుమతులను మూడు రెట్లు పెంచింది. తత్ఫలితంగా ట్రంప్‌ ప్రభుత్వం చైనాపై బహుళ సుంకాలు విధించింది. వియత్నాం ద్వారా చైనా తన ఎగుమతులను బలోపేతం చేయడానికి, అమెరికాచైనా వాణిజ్య యుద్ధం తర్వాత చైనా వియత్నాంలో ఒక ముఖ్యమైన విదేశీ పెట్టుబడిదారుగా అవతరించింది. సింగపూర్‌, దక్షిణ కొరియా తర్వాత వియత్నాంలో చైనా 3వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు. వియత్నాంలో చైనా పెట్టుబడులు అమెరికాలో అధిక సుంకాన్ని తప్పించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఇందులో భాగంగా వియత్నాంలో చైనా వస్తువుల ప్రాసెసింగ్‌ చేయడం, తద్వారా అధిక సుంకాన్ని నివారించడానికి వియత్నాం లేబుల్‌ కింద అమెరికాకు వస్తు ఎగుమతుల జరుగుతున్నాయి. వియత్నాం ప్రావిన్షియల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌ ప్రకారం, వియత్నాంలో చైనా పెట్టుబడులు 2021లో 2.92బిలియన్ల నుంచి 2023లో చైనా పెట్టుబడులు 4.47 బిలియన్లకు పెరిగి 53 శాతం పెరుగుదల నమోదుచేసింది.
వియత్నాం` చైనా మధ్య ఈ రహస్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇన్‌పుట్‌లు, ట్రాన్స్‌షిప్‌మెంట్‌ ద్వారా అమెరికాకు వియత్నాం తన ఎగుమతులను భారీగా పెంచింది. దీని ఆధారంగా అమెరికా చైనా ట్రాన్స్‌షిప్‌మెంట్‌పై కఠినమైన నిఘాతోపాటు సుంకాలను భారీగా పెంచింది. అయితే భారత్‌ వియత్నాం కంటే ఎగుమతుల్లో ముందంజలో ఉంది. ప్రపంచ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత్‌ మెరుగైన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ పరికరాలు, విడి భాగాలు, దుస్తులు వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికుల సహకారం ఉంది. ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి పరిశ్రమలలో భారత్‌ ఇంజినీర్లు, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కార్మికులతో ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ పెద్ద వాటాను సంపాదించుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కూడా భారత్‌ అమెరికాతో మెరుగైన సంబంధాలు ఉన్నాయి. అమెరికా భారతదేశంలో మూడో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు. భారతదేశంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల్లో అతిపెద్ద వాటా కంప్యూటర్‌లో ఉంది. కంప్యూటర్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌తో సహా భారత్‌లోని మొత్తం విదేశీపెట్టుబడుల్లో ఇవి దాదాపు 44 శాతం ఉన్నాయి. భారత్‌లో ఎఫ్‌డీఐ ప్రధాన లక్ష్యం తక్కువ ఖర్చుతో కూడిన ఐటీ సేవలను పొందడం.అయితే, అమెరికాలో అధిక సుంకాలను తప్పించుకోవడానికి తయారీలో చైనా వియత్నాంను కేంద్రంగా చేసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు