Homeక్రీడలుసవాళ్లకు ఎదురెళ్లడమే నాకిష్టం: బుమ్రా

సవాళ్లకు ఎదురెళ్లడమే నాకిష్టం: బుమ్రా

- Advertisement -

న్యూదిల్లీ: భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్ విజయం గురించి మాట్లాడుతూ… తనకు ఆటలో కఠిన సవాళ్లు ఎదుర్కోవడమంటే ఇష్టమని స్పష్టం చేశాడు. సంబంధిత వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ‘నాకు కఠిన సవాళ్లు ఎదుర్కోవడం అంటేనే ఇష్టం. మంచి ప్రదర్శన చేసి, సత్తా చాటినప్పుడు.. అది నాలో చాలా ఆనందాన్ని నింపుతుంది. దానికి మించిన సంతోషం మరోటి లేదు. నేను గుజరాత్‌లోనే క్రికెట్ ఆడటం ప్రారంభించా. వరల్డ్ కప్ కూడా ఇక్కడే గెలిచాం. ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచింది కూడా ఇక్కడే’ అని బుమ్రా అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తృటిలో టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. ఆ విషయాన్ని బుమ్రా గుర్తు చేసుకుంటూ ‘గతంలో మేం తృటిలో ఓడిపోయాం. కానీ ఈ సారి గెలిచాం. చాలా ఆనందంగా ఉంది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. దేవుడికి కృతజ్ఞతలు. అతడు చాలా దయగలవాడు’ అని అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో బుమ్రా బంతితో చక్కగా రాణించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం భారత విజయంలో కీలక పాత్ర వహించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు