Thursday, December 5, 2024
Homeసెకీ ఒప్పందంతోనాకు సంబంధం లేదు

సెకీ ఒప్పందంతోనాకు సంబంధం లేదు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్‌లో నిర్ణయం కోసం అర్థరాత్రి దస్త్రాన్ని పంపి సంతకం చేయమన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేవలం మంత్రి వర్గం చర్చ కోసం అనుకుని సంతకం చేశానన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి బాలినేని కౌంటర్‌ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఒంగోలు జిల్లాల్లో ఆర్టీసీ సైట్లను తీసుకున్నవా?, లేదా? అని నిలదీశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేస్తూ కందుకూరు, సంత నూతల పాడు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీయమంటావా? అని నిలదీశారు. చెవిరెడ్డిది చిత్తూరు జిల్లా అయ్యి ఉండి కూడా ఒంగోలులో మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అండతో చేసిన బాగోతాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే కాదని… విజయమ్మ, షర్మిల కూడా అని అన్నారు. ఎవరి మెప్పు కోసం పని చేయడం లేదని, ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు