ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; భారతీయ విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా అధికారులు సిబ్బంది నడుమ నిర్వహించుకున్నారు. అనంతరం వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. బ్రిటిష్ పాలలను ఎదిరించి స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన గొప్ప వీరుడు అని తెలిపారు. అటువంటి అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవలో నిమగ్నం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని సుబ్బారావుపేట గ్రామపంచాయతీలో సందర్శించి ఇంటింటికి చెత్త సేకరణ, వీధుల్లో ఉండే విద్యుత్ దీపాలు పనితీరు, పశువుల నీటి తొట్టెల వాడకం, పారిశుద్ధ్య పనులు గూర్చి వారు క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది. గ్రామం ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. గ్రామ ఆరోగ్యమే ప్రజల ఆరోగ్యం అవుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, స్థానిక నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, హరిత రాయబారులు పాల్గొన్నారు.