Homeవ్యాపారంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్‌టి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్‌టి

- Advertisement -

అమరావతి : యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బివైఎస్ టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత, చేయూత అందించటం ద్వారా బివైఎస్ టి మద్దతును అందిస్తుంది. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఎంఎసఎంఈ, సెర్ప్, ఎనఆరఐ సాధికారతలు, సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై బివైఎస్ టి సంతకం చేసింది. ఇది “ఒక కుటుంబం, ఒక వ్యవస్థాపకుడు (ఓఎఫఓఈ)” అనే లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. ప్రతి ఇంటిలోనూ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, బలమైన స్థానిక పర్యావరణ వ్యవస్థలను నిర్మించడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమం విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, కడప మరియు అనంతపురం జిల్లాల్లో తొలుత అందుబాటులోకి తీసుకురానున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు