Homeతెలంగాణకలిసికట్టుగా పనిచేద్దాం

కలిసికట్టుగా పనిచేద్దాం

- Advertisement -

. సుపరిపాలన దిశగా సాగుదాం
. కార్పొరేషన్ అభివద్ధే ధ్యేయం కావాలి
. మేయర్, డిప్యూటీ మేయర్‌కు అభినందనలు: కూనంనేని

విశాలాంధ్ర – కొత్తగూడెం: సుదీర్ఘ లక్ష్యం కోసం విశాలమైన దృక్పథంతో సీపీఐ, కాంగ్రెస్ కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తమకు తాత్కాలిక ప్రయోజనాలు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. మేయర్ , డిప్యూటీ మేయర్ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు సోమవారం ప్రమాణ స్వీకారం ద్వారా తెరదించారు. ఎలాంటి విభేదాలు లేకుండా చాలా ప్రశాంతంగా కార్పొరేషన్ మొదటి సమావేశం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవ ఎన్నిక అనంతరం మీడియాతో కూనంనేని మాట్లాడారు. పాల్వంచ, సుజాత నగర్ లోని కొంత ప్రాంతం కలుపుకుని కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడిందన్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాల కారణంగా సీపీఐ, కాంగ్రెస్ విడివిడిగా స్నేహపూర్వక పోటీలో భాగంగా ఎన్నికల బరిలో దిగినట్టు ఆయన వివరించారు. ఈనెల 11న ఎన్నికలు జరగగా, 13న ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. 60 డివిజన్లలో సీపీఐ 22 డివిజన్లను సొంతం చేసుకుందన్నారు. మద్దతు తెలిపిన స్వతంత్ర కార్పొరేటర్‌తో కలిపి 23 సీట్లు సాధించామన్నారు. సీపీఐకి చెందిన మూడ్ గణేశ్ మేయర్, కాంగ్రెస్ కు చెందిన సిరిపురపు లలిత కుమారి డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ తర్వాత అంతటి విశిష్టత, పారిశ్రామికీకరణ, బొగ్గు గనులు ఇక్కడ ఉన్నాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధి మరింతగా జరుగుతుందని, పెద్దపెద్ద కంపెనీలు ఇక్కడికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయ న్నారు. తాను దూర దృష్టితోనే కొత్తగూడెం కార్పొ రేషన్ ఏర్పడటానికి ప్రభుత్వ మద్దతు ద్వారా సఫలీకృ తమైనట్లు వెల్లడించారు. ప్రజల ఆర్ధిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. త్వరలో విమానాశ్రయంతో పాటు, పెద్దపెద్ద పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. రాగద్వేషాలకు, పార్టీలకు అతీతంగా ఉంటూ తమ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా పాటుపడతామన్నారు. తన ప్రతిపాదనలు అంగీకరించి సానుకూల దృక్పథŠంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు. సుపరిపాలన దిశగా ముందుకు సాగాలని, కార్పొరేషన్ అభివృద్ధే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుని నీతివంతమైన, నిజాయతీ గల, పారదర్శక పాలనను ప్రజలకు అందించాలని కూనంనేని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు