. పోరాటాలకు సిద్ధం కావాలి
.ఏఐటీయుసీ అంటే ఎల్లలులేని సమాజ నిర్మాణం
. ఎర్రజెండా నీడలోనే కార్మిక సంఘాలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
విశాలాంధ్ర – తిరుపతి : ఎల్లలులేని సమ సమాజ నిర్మాణం కోసం కార్మిక సంక్షేమమే ధ్యేయంగా అలఇండియా ట్రేడ్ యÖనియన్ కాంగ్రెస్ (ఏఐటీయÖసీ) పనిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఏఐటీయÖసీ రాష్ట్ర 18వ మహాసభలలో భాగంగా ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ… కార్మికుల స్వేచ్ఛ,హక్కుల పరిరక్షణ కు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.రాష్ట్రం లోని బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకు సీపీఐ ప్రత్యామ్నాయం కాదని…కార్మిక వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లాలని అన్నారు. బూర్జువా సంస్థలపై పోరాటాలు చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పాలక ప్రభుత్వాలు కులాలకు, మతాలకు మధ్య గొడవలు పెట్టి నిరంకుశ పాలన చేస్తున్నాయన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసా గుతుండటం దురదృష్టకరం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలు, హక్కుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం పై విప్లవ పోరాటం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు కార్మికుల కు లేనిపోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మిక సంఘాలు స్వతంత్ర పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆదర్శంగా ఉద్యమ నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్రం లో ఉన్న ఔట్ సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మికులు తదితర కార్మిక వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వారి హక్కుల సాధన కోసం ఏఐటీయుసీ నిరంతరం పోరాటాలు చేస్తోందని… కార్మిక సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఈశ్వరయ్య అన్నారు.


