Homeజాతీయంగుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఐదు రోజులుగా ఎగసిపడుతున్న అలలు

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఐదు రోజులుగా ఎగసిపడుతున్న అలలు

- Advertisement -

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలో చోటుచేసుకున్న వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీర్‌పార్థ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో గత ఐదు రోజులుగా నీరు భారీ అలల్లా ఎగసిపడుతోంది. నీరు బావిలో అటూ ఇటూ ఊగిపోతూ,కొన్ని సందర్భాల్లో బయటకు పొంగిపొర్లుతోంది.ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారడంతో,సమీప గ్రామాల నుంచి కూడా ప్రజలు ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.వ్యవసాయ క్షేత్రం యజమాని ప్రాంజీవన్ సదరియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ బావిని మూడు నెలల క్రితమే తవ్వారు.అయితే ఈ నెల 2వ తేదీన తొలిసారిగా బావి నీటిలో అసాధారణ కదలికలను గమనించినట్లు ఆయన చెప్పారు.

భయాందోళనకు గురైన గ్రామస్థులు
అప్పటి నుంచి నీటిలో అలల మాదిరిగా కదలికలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ ఘటనతో తొలుత గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.బావిలో నీరు ఈ విధంగా ఉప్పొంగడం భూకంపానికి సంకేతమేమోనని అనుమానించారు. అయితే జిల్లా భూగర్భ శాస్త్రవేత్త జేఎస్‌ వధేర్ ఈ అనుమానాలను కొట్టిపారేశారు.గాంధీనగర్‌లోని భూకంప పరిశోధనా సంస్థ సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూకంపం సంభవించే సూచనలు లేవని ఆయన స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్విహిస్తున్న భూగర్భ నిపుణుల బృందం
బావిలోని రాళ్ల మధ్య ఉన్న సందుల నుంచి గాలి బయటకు రావడం వల్ల నీటిపై గాలి ఒత్తిడి పెరిగి, అలల మాదిరి కదలికలు ఏర్పడే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఈ వింత ఘటన వెనుక అసలు కారణాలను నిర్ధారించేందుకు భూగర్భ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తోందని మోర్బి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు