నాజీ శకం ముగిశాక తొలిసారి మితవాదులకు పట్టం
బెర్లిన్: మితవాదులు రాజకీయంగా సంచలనం సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంటే నాజీ శకం తర్వాత జర్మనీలో విజయబావుట ఎగురవేశారు. సాకస్నీ-అన్హాల్ట్ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ ఘన విజయం సాధించింది.
ఈనెల 6న జరిగిన లాండ్టాగ్ ఎన్నికలలో, 43.8 శాతం ఓట్లు`39 సీట్లు పొందింది. 2021లో 20.8 శాతం ఓట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి రెట్టింపు ఓట్లతో విజయం నమోదు చేసింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పార్టీ ‘క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్’ 17.2 శాతం ఓట్లు మాత్రమే పొందింది. 83 మంది సభ్యులున్న సాక్సోనీ-అన్హాల్ట్ అసెంబ్లీలో ఏఎఫ్‌డీకి 39 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 42 సీట్ల” అవసరం కాగా ఈ పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలంటే మూడు సీట్లు తక్కువయ్యాయి. దీంతో సంకీర్ణం దిశగా కసరత్తు ప్రారంభమైనట్లు తెలిసింది. జర్మనీలో ఆర్థికంగా వెనకడిన ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతే ఏఎఫ్‌డీకి చారిత్రక విజయాన్ని అందించిందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. అయితే ఏఎఫ్‌డీతో పొత్తునకు ప్రధాన పార్టీలు మొగ్గుచూపడం లేదు. ఇలాంటి పరిణామాన్ని జర్మన్ రాజకీయాల్లో ‘ఫైర్‌వాల్’ అంటారు. దీంతో ఏఎఫ్‌డీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
జర్మనీలో ఏఎఫ్‌డీ ఘన విజయం
- Advertisement -
RELATED ARTICLES


