Homeట్రంప్ శాంతి మండలికిభారత్, చైనా, ఫ్రాన్స్ దూరం

ట్రంప్ శాంతి మండలికిభారత్, చైనా, ఫ్రాన్స్ దూరం

- Advertisement -

నిర్ణయం తీసుకోని ఇటలీ, రష్యా, టర్కీ, ఉక్రెయిన్
సభ్యులుగా చేరిన పాక్, యూఏఈ సహా 35 దేశాలు

దావోస్/న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి మండలి అధికారికమైంది. దావోస్‌లో ప్రపంచా ఆర్థిక ఫోరం సందర్భంగా ట్రంప్ సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. పాకిస్థాన్, అజర్‌బైజన్, యూఏఈ సహా 35 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. భారత్, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, జర్మనీ వంటి కీలక దేశాలు ఈ మండలిలో చేర లేదు. సంతకాలకు దూరంగా ఉన్నాయి. ఇటలీ, పరాగ్వే, రష్యా, స్లోవేనియా, టర్కీ, ఉక్రెయిన్ ఇంకా నిర్ణయించుకోలేదు. అర్జెంటైనా, అర్మేనియా, బెహ్రెయిన్, బెలారస్, ఈజిప్టు, హంగేరీ, కజకస్థాన్, మొరొక్కో, పాకిస్థాన్, సౌదీ అరేబియా, వియత్నాం శాంతి మండలిలో భాగస్వామ్యానికి అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. అయితే శాశ్వత సభ్యదేశాలుగా ఉండాలంటే బిలియన్ డాలర్లు ఇవ్వాలని ట్రంప్ షరతు పెట్టడం విదితమే. కాగా, ట్రంప్ ఆహ్వానం అందినప్పటికీ సుస్నితాంశాలతో ముడిపడిన క్రమంలో భారత్ ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. శాంతి మండలిలో చేరాలో వద్లో ఇంకా నిర్ణయంచుకోలేదని అధికార వర్గాల సమాచారం. ఐక్యరాజ్య సమితికి ట్రంప్ శాంతి మండలి సవాల్ విసురుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయి నూతన సంస్థగా ‘బోర్డ్ ఆఫ్ పీస’పై అమెరికా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. వాస్తవానికి గజా పునరాభివద్ధి కోసం నిధులు, పరిపాలన వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఈ మండలి ఏర్పాటైంది. కానీ, దీనిని శాంతి, సుస్థిరత, స్థిరమైన చట్టబద్ధ పాలనకు హామీ ఇచ్చే అంతర్జాతీయ వ్యవస్థగా చార్టర్ పేర్కొంది. ట్రంప్ మార్గదర్శత్వం… దేశాధినేతల నాయకత్వంలో పనిచేయనున్నది. తొలుత ట్రంప్ మాట్లాడుతూ, శాంతి మండలిలో భాగస్వామ్యాన్ని అందరూ కోరుకుంటున్నారని, ఐరాస సహా అందరితో కలిసి పనిచేస్తామన్నారు. 50కు పైగా దేశాధినేతలకు ఆయన ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ‘ఐరాస ఎంతో చేయాల్సి ఉందన్నది. లేకుంటే శాంతి మండలి అవసరముండేది కాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో ఇది గజాకు పరిమితం కాదని తేలిపోయింది. ట్రంప్ మాట్లాడుతూ ‘నేటి ప్రపంచం గతేడాది కంటే మరింత సంపన్నంగా, సురక్షితంగా, శాంతియుతంగా ఉన్నది. అగ్నిజ్వాలలు ఆర్పేశాం. అణుశక్తులైన భారత్పాక్ యుద్ధం ముగించడం ఆనందాన్ని కలిగించింది’ అని అన్నారు. పరిస్థితి చేయిదాటకముందే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని, దాదాపు 1020 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడారని పాకిస్థాన్ ప్రధాని అన్న మాటలు తనకు అమితానందాన్ని ఇచ్చాయని ట్రంప్ చెప్ప్పుకున్నారు. అయితే గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ట్రంప్ మండలికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానించిందని, ఆ మేరకే సహకారం అందిస్తుందని ఐరాస ప్రతినిధి రొలాండో గోమెజ్ తెలిపారు. దావోస్ వేదిక నుంచి శాంతి మండలిపై ప్రకటన సందర్భంగా ‘ఆయుధాలు వీడకపోతే అస్తిత్వాన్ని కోల్పోతారని హమాస్‌కు ట్రంప్ మరోమారు హెచ్చరికలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు