. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు
. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: కూనంనేని
విశాలాంధ్ర బ్యూరో –
కొత్తగూడెం : నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల అవసరాల కనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏడాదిన్నరలోనే ఇంత వేగంగా అభివృద్ధి పనులు మునుపెన్నడూ జరగలేదన్నారు. సుజాతనగర్ మండల పరిధిలో ఎనిమిది పంచాయతీల పరిధిలో పూర్తయిన 18 అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. మరో 14 పనులకు శంకుస్థాపన చేశారు. సర్వారం, కోయగూడెం, బేతంపూడి, జామ్లా తండా, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, నర్సింహా సాగర్, సింగభూపాలెం పంచాయతీల పరిధిలో పరిధిలో రూ.1.30 కోట్లతో పూర్తయిన రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులను ప్రారంభించారు. మరో రూ.1.87 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కూనంనేని మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిస్కారంకోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 70 శాతం మేర గ్రామీణ ప్రధాన , అంతర్గత రహాదారులు పూర్తిచేశామన్నారు. తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యం కు ప్రాధాన్యత కల్పిస్తున్నామని వివరించారు. తాగునీటి సమస్య పరిస్కారంకోసం మూడు ప్రాంతాల్లో రూ.1.38 కోట్లతో నిర్మించనున్న సంపు, పంప్ హౌస్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశామన్నారు. మరో రూ.30 లక్షలతో పైపు లైన్ల నిర్మాణం, పునర్నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజల సౌకర్యార్ధం ప్రతి పంచాయతీకి పక్కా భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్యశాలలను బలోపేతం చేసేందుకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. పనులు నాణ్యత ప్రమాణలతో జరిగేలా పర్యవేక్షించాలని కూనంనేని అధికారులకు సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, పీఏసీఎస్ చైర్మన్ మండే మనుమంతరావు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, అధికారులు శివయ్య, కిషన్, నర్మద, పార్టీ జిల్లా సమితి సభ్యులు భూక్యా దస్రు, కొమారి హేమంతరావు, కొమారి కృష్ణ, జక్కుల రాములు, నాయకులు పొదిలి శ్రీనివాస్, తాళ్లూరి పాపారావు, వేర్ల మల్లేష్, వీర్ల దుర్గాప్రసాద్, మూడు గణేష్, భూక్యా శ్రీను, మేకల వెంకటేష్, ఎర్ణం రాజు, సురేష్, ఎండి. రఫీ, అనిల్, నాగేంద్రబాబు, అనిల్ పాల్గొన్నారు.