Wednesday, July 2, 2025
Homeతెలంగాణమాదక ద్రవ్యాల జోలికెళ్లొద్దు

మాదక ద్రవ్యాల జోలికెళ్లొద్దు

. చదువుపై దృష్టి పెట్టండి
. నల్లగొండలో రూ.34 కోట్లతో స్కిల్‌ సెంటర్‌: మంత్రి కోమటిరెడ్డి

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : భవిష్యత్‌ బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. నల్లగొండలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త అధ్వర్యంలో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎన్‌జి కళాశాల నుంచి క్లాక్‌ టవర్‌ వరకు నిర్వహించిన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. క్లాక్‌ టవర్‌ ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ కు విద్యార్థులు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం స్కిల్‌ యూనివర్సిటీ కట్టిస్తున్నామని ,ఇందులో భాగంగా నల్లగొండలో రూ. 34 కోట్లతో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రగ్స్‌ను తరిమి కొట్టాలని, స్పోర్ట్స్‌, యోగపై దృష్టిపెట్టాలని విద్యార్థులకు సూచించారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉందాలని, చదువుపైనే దృష్టి పెట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని కోరారు. ప్రకాశం బజార్‌లో ప్రతీక్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని, డిజిటల్‌ తరగతులతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైద్రాబాద్‌లో డ్రగ్స్‌ పై కఠిన చర్యలుతీసుకొంటున్నామని, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని వివరించారు.
భవిత సెంటర్‌ ప్రారంభం
ప్రతీక్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని మోడల్‌ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోమటిరెడ్డి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో భవిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇప్పటికే రూ. 10 లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వారానికి రెండుసార్లు విద్యార్థులకు స్పీచ్‌ తెరఫీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ తెలుపగా, అందుకు మంత్రి అంగీకరిం చారు. భవిత కేంద్రంలో ఏసీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యా ర్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లలకు చాక్లెట్లను పంపిణీ చేశారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అప్పాజీపేట నుంచి మిర్లోని గూడెం వరకు కోటి రూపాయల నిర్మించ నున్న బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని గ్రామాలలో రహదారి సౌకర్యంతోపాటు, చెరువుల పటిష్టత వంటివి చేపట్టడం జరిగిందని ,రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు మద్దతు ధర కల్పించడం , సన్నధాన్యానికి రూ.500 బోనస్‌ అమలు చేస్తున్నామన్నారు. గ్రామ చెరువు కట్ట పటిష్టతకు అంచనాలను రూపొందించి పంపించాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు