Homeతెలంగాణమాది చేతల ప్రభుత్వం

మాది చేతల ప్రభుత్వం

- Advertisement -

రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కుంభమేళా తరహా మేడారం జాతర: పొంగులేటి

విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం/ఖమ్మం రూరల్‌: మాది బొమ్మలు చూపే ప్రభుత్వం కాదని, ప్రజాప్రభుత్వం అని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మద్దులపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ డాక్టర్‌ పి. శ్రీజ, ఖమ్మం పోలీస్‌ కమీషనర్‌ సునీల్‌ దత్‌, అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఈ నెల 18న జరుగనున్న సీఎం పర్యటన వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడిరచారు. పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాల నిర్మాణానికి, మున్నేరు నుంచి పాలేరు లింక్‌ కెనాల్‌కు శంకుస్థాపన, నూతన మార్కెట్‌ యార్డు, కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్‌ ఆవిష్కరణ, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను సీఎం ప్రారంభిస్తారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక కార్పోరేషన్‌, ఆరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల కోసం ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారంతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలకు ముఖ్యమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు. మేడారంలో ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని, ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతర జరగడం సర్వసాధారణం అని, ఈ సారి జరిగే జాతరకు ప్రత్యేకత ఉందని, అక్కడ కాకతీయుల రాతి కట్టడాల తరహాలో సుందరీకరణ, శాశ్వత రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించామని అన్నారు.19న అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని, 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. కుంభమేళా తరహాలో జాతర ఏర్పాట్లు చేశామని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు