Homeతెలంగాణమీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

- Advertisement -

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం బుధవారంతో ముగియడంతో మరో రెండేళ్ల పాటు ఆయన్ను ఆ పదవిలో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులి చ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆయన పని చేశారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 ఫిబ్రవరిలో కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమిం చింది. ఆయన బాధ్యతలు తీసుకున్న తరువాత మీడియా రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జర్నలిస్టుల గుర్తింపు కార్డులు జారీ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను సవరిస్తూ నూతన జీఓను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలో నూతన కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగు తోంది. జర్నలిస్టుల పక్షపాతిగా ఉండే శ్రీనివాస్ రెడ్డి… మరో రెండేళ్లపాటు పదవిలో కొనసాగేందుకు అవకాశం కల్పించ డంపై టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్య క్షుడు విరహత్ అలీ, ఐజేయు నాయకులు నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ రెడ్డి, శంకర్, బొమ్మగాని కిరణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు