ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాలాంధ్ర – నందిగామ : వంశీ లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే పదవికే మచ్చ తెచ్చారని అటువంటి వారిని శిక్షిస్తే సమాజానికి మంచిదే అని ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు గురువారం ఓ ప్రకటనలో ఆమె మాట్లాడుతూ వంశీ మనిషి కాదని,ఆయన ఒక మృగమని అన్నారు.వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే చంపేసేవారని,ఇక్కడ కాబట్టి బతికిపోయాడని చెప్పారు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి వంశీ అని అన్నారు.పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా వంశీ డ్రామాలు ఆడాడని,డ్రెస్ మార్చుకుంటానని లోపలకు వెళ్లి ఫోన్లు చేసి,అల్లర్లకు పాల్పడాలని అనుచరులకు చెప్పాడని తంగిరాల సౌమ్య మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని,కార్లు తగులబెట్టారని, మనుషులను చంపేందుకు కూడా యత్నించారని అన్నారు.కేసు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ ని భయపెట్టాడని చెప్పారు.వంశీ బతుకు ఇప్పుడు బయటపడిందని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అన్నారు. అంతకుముందు నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితో ఒక జగన్మోహన్రావు మాట్లాడుతూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లమనేని వంశీ అరెస్టు ను ఆయన ఖండించారు ఇది ప్రభుత్వం చేసే కక్ష సాధింపు చర్యలుగా ఆయన పేర్కొన్నారు…