Homeతెలంగాణసామాజిక సమానత్వంతోనే అభివృద్ధి : కలెక్టర్

సామాజిక సమానత్వంతోనే అభివృద్ధి : కలెక్టర్

- Advertisement -

విశాలాంధ్ర, హైదరాబాద్ : సామాజిక సమానత్వం, న్యాయం ద్వారానే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అన్నారు. అంబర్ పేట్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు జి ఆశన్న మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తదుపరి సమానత్వం, సమన్యాయం పై జిల్లా అధికారులు, విద్యార్థులతో కలసి ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులు అలాగే మైనార్టీ శాఖల విద్యార్ధులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్న వారికి ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి కోటాజి, దివ్యాంగుల శాఖ ఏడి రాజేందర్, తహసిల్దార్ శ్రీదేవి ఆర్‌సిఓలు, సిడిపివోలు, వార్డెన్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు