Homeఅంతర్జాతీయం300 డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడి

300 డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడి

- Advertisement -

ఉక్రెయిన్‌ జైలులో 17 మంది మృతి
మాస్కో : రష్యా`ఉక్రెయిన్‌ మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. అర్థరాత్రి 300కుపైగా డ్రోన్లు, నాలుగు క్రూయిజ్‌ క్షిపణలులు, మూడు బాలిస్టిక్‌ క్షిపణులతో రష్యా తమ దేశంపై విరుచుకుపడినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళం వెల్లడిరచింది. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు తెలిపింది. ఆగ్నేయ జపోర్జియా ప్రాంతంలోని జైలుపై చేసినట్లు కీవ్‌ పేర్కొంది. ఈ దాడిలో 17 మంది చనిపోగా,. 80 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడిరచారు. రష్యా దాడుల ప్రభావం బిలెన్‌కివ్క్సాలోని మరో కాలనీపైనా కనిపించిందన్నారు. జైలు భోజనాల గదితో సహా పరిపాలనా, క్వారంటైన్‌ భవనాలు దెబ్బతిన్నాయన్నారు. మరో మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఓ ప్రసూతి ఆసుపత్రితో పాటు ఇంకొన్ని ఆసుపత్రులకు నష్టం కలిగినట్లు వెల్లడిరచారు. ఖైదీలు తప్పించుకోలేదని చెప్పారు. రష్యా ప్రయోగించిన వాటిల్లో 32 డ్రోన్‌లను అడ్డుకున్నామని ఉక్రెయిన్‌ తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు