Homeఅంతర్జాతీయంటారిఫ్‌లతో 600 బిలియన్ డాలర్లు.. దేశం బలోపేతమైంది: ట్రంప్

టారిఫ్‌లతో 600 బిలియన్ డాలర్లు.. దేశం బలోపేతమైంది: ట్రంప్

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌ టారిఫ్‌ల (సుంకాలు) విధానాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. టారిఫ్‌ల ద్వారా తమ దేశానికి 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సమకూరిందని, త్వరలోనే మరిన్ని నిధులు రానున్నాయని ప్రకటించారు. ఈ విధానం వల్ల దేశం ఆర్థికంగానే కాకుండా, జాతీయ భద్రత పరంగా కూడా ఎంతో బలపడిందని ఆయన అన్నారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. టారిఫ్‌ల ద్వారా మాకు 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. కానీ, ఫేక్ న్యూస్ మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. సుప్రీంకోర్టులో టారిఫ్‌లపై రాబోయే కీలక తీర్పును ప్రభావితం చేయడానికే ఇలా చేస్తున్నారు అని ఆరోపించారు. టారిఫ్‌ల వల్లే అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్, విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రత, విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై కూడా 50 శాతం టారిఫ్‌లు విధించారు.

ప్రత్యామ్నాయ మార్గాల్లో భారత్
అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో భారత్ తన ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇతర దేశాలకు ఎగుమతులను విస్తరించేందుకు న్యూఢిల్లీ ప్రణాళికలు రచిస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. మొత్తం ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకే వెళుతున్నాయి. చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ వ్యవసాయం, డెయిరీ వంటి కీలక రంగాలను అమెరికాకు తెరిచే విషయంలో భారత్ సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో అమెరికా తన టారిఫ్‌లను వెనక్కి తీసుకునే అవకాశం తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు