Homeజిల్లాలుశ్రీ సత్యసాయివారం రోజుల్లో తొలగించుకుంటే ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతాం

వారం రోజుల్లో తొలగించుకుంటే ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతాం

- Advertisement -

650-2, సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలను తొలగించాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నెంబర్లు అక్రమ కట్టడాలను యుద్ధ ప్రాతిపతకాన తొలగించాలని, లేనియెడల వారం రోజుల్లో తొలగించుకుంటే ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ
పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులకు అన్యాయం జరిగింది అని, అర్హులైన కార్మికులకు పట్టాలు ఇవ్వకుండా, అనర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి, అర్హులైన కార్మికుల్ని రోడ్డున పడేశారు అని మండిపడ్డారు.గత మూడు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది అని తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు అనేక ఉద్యమాలు చేసిన ఫలిత మే రెవెన్యూ అధికారులు స్పందించి కార్మికుల దగ్గరకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని తెలపడం జరిగిందన్నారు. 650-2 సర్వే నెంబర్ లో అనర్హులైన వారి పట్టాలను రద్దుచేసి, ఎవరైతే నిజమైన కార్మికులు ఉన్నారో వారికి వెంటనే పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారని, మొత్తం 76 నకిలీ పట్టాలను ధర్మవరం ఆర్డీవో రద్దు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. కావున మున్సిపల్ కమిషనర్ గా తమరు సర్వేలో అక్కడ నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి,అన్యాక్రాంతం చేసిన వారిపై 420 కేసులు నమోదు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల కి ఇళ్ల పట్టాలిచ్చి వారికి న్యాయం జరిగే విదంగా చర్యలు వేగవంతంగా చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమం లోAP చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత నాయకులు, చెన్నంపల్లి శ్రీనివాసులు, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, రామసుబ్బయ్య,రామకృష్ణ, సురేంద్ర,నాగేంద్ర,చిన్న, పీరా, జనార్ధన్, మహిళా సమైక్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ,ఈరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు