విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి కార్యాలయంలో వారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన ‘‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’’ పుస్తకాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు ఆవిష్కరించారు.అనంతరం వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ కూటమి ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలను పుస్తకంలో ప్రచురించడం జరిగిందన్నారు.
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మేనిఫెస్టోను పక్కాగా అమలు చేశాం అని, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఐదేళ్లలో ఏకంగా రూ.2.81 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చాం అని తెలిపారు.
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజలను మోసం చేశారో.. ఇప్పుడు కూడా మోసం చేస్తూనే ఉన్నారు అని మండిపడ్డారు.
సమస్యలను ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని, గట్టిగా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారు అని తెలిపారు. ఏడాదిగా ఇదే తంతు జరుగుతోందని తెలిపారు. అదే
మేం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షంగానే ఉంటాం అని స్పష్టం చేశారు.
ఏడాదిగా ప్రజల పక్షాన నిలుస్తూ వచ్చాం అని, మా పోరాటం కారణంగానే ఏడాది తర్వాత తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు అని తెలిపారు. అది కూడా 67 లక్షల మందికి అని చెబుతున్నా వాస్తవానికి 37 లక్షల 70 వేల మందికే ఇవ్వడం జరిగిందన్నారు.
నమ్మకానికి ప్రతిరూపం వైఎస్ జగన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మోసానికి ప్రతిరూపం చంద్రబాబు, కూటమి పార్టీలు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మాసపల్లి సాయికుమార్, జిల్లా కార్యదర్శి చిగిచెర్ల ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నీలూరు ప్రకాష్, కోటిరెడ్డి బాలిరెడ్డి, ధర్మవరం మునిసిపల్ మాజీ వైస్ ఛైర్మెన్ చందమూరి నారాయణ రెడ్డి, పెనుజూరి నాగరాజు, కౌన్సిలర్ జిలాన్ భాషా, వార్డు ఇంచార్జ్ లు చాంద్ భాషా, భాషా, భాస్కర్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పురుషోత్తం, మైనారిటీ నాయకులు సిద్దిక్, ఇదయతుల్లా, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ పోతుకుంట రామయ్య, ధర్మవరం రూరల్ మండల బిసి నాయకులు చెలిమి రామయ్య, నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెటైర్డ్ ఉద్యోగస్థుల అధ్యక్షుడు కునుకుంట్ల రామలింగా రెడ్డి, బివి రమణ, దేవరకొండ రమేష్, రాజశేఖర్ రెడ్డి, బొమ్మన్న, నాగరాజు, అశోక్ రెడ్డి, నారాయణ స్వామి, మహేష్ , సాధిక్, తిరుపాల్, జగదీష్, బెస్త రమణ, శ్రీనివాసులు, నరేష్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ
- Advertisement -
RELATED ARTICLES


