. తమను లొంగదీసుకునేందుకే అమెరికా దాడులు
. ఇరాన్ సుప్రీం నేత ఖామేనీ
తెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖామేనీ గురువారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిరచారు. ఆ దాడి కేవలం అణు అంశాలపై కాదని, యురేనియం శుద్ధి గురించి అసలే కాదన్నారు. కేవలం ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న కాంక్షతోనే అమెరికా దాడులకు ప్రయత్నించి నట్లు ఖామేనీ తెలిపారు. జూన్ 19 తర్వాత తొలిసారిగా ఇరానియన్ స్టేట్ టెలివిజన్‌లో ఖామేనీ వ్యాఖ్యల వీడియో ప్రసారమైంది.
ఓ సారి మానవ హక్కులు, ఓ సారి మహిళా హక్కులు, మరో సారి అణు కేంద్రాల అంశం, మిస్సైళ్ల గురించి అమెరికా ఒత్తిడి తెస్తుందన్నారు. వాస్తవానికి ఈ అంశాల కన్నా… తాము లొంగిపోవాలన్న ఉద్దేశంతోనే అమెరికా దాడులకు దిగినట్లు ఖామేనీ వెల్లడిర చారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయిల్ నాశనమవుతుందని అమెరికా భావించడం వల్లే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు. అయితే, ఈ యుద్ధం వల్ల అమెరికా ఎటువంటి ప్రయోజనం సాధించలేక పోయిందని ఎద్దేవా చేశారు. సరెండర్ అన్న పదం తమ నిఘంటువులో లేదపి ఖామేనీ స్పష్టం చేశారు. క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శించారని ఖామేనీ ప్రశంసించారు. తామంతా ఒకే స్వరాన్ని వినిపించినట్లు చెప్పారు. సరెండర్ కావాలని ట్రంప్ పేర్కొన్నారని, కానీ ఇరాన్ లాంటి గొప్పదేశానికి ఆ పదం ఓ అవమానం అని తెలిపారు. అమెరికా తన నైజాన్ని చెప్పకనే చెప్పేసిందని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ను ఆ దేశం వ్యతిరేకిస్తున్న విషయం స్పష్టమైంద న్నారు. ఇజ్రాయిల్‌పై విజయం సాధించినందుకు దేశ ప్రజలకు, ముఖ్యంగా సాయుధ బలగాలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా అమెరికా ఎటువంటి ఘనతను సాధించలేదని అన్నారు. జరిగిన ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు అతిగా ప్రచారం చేసినట్లు ఖామేనీ విమర్శించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న కీలక అమెరికా వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినా కూడా దాన్ని వాళ్లు కొట్టిపారేశారని అన్నారు.
తెరుచుకున్న గగనతలం
ఇజ్రాయిల్‌తో ఉద్రిక్తతలు తగ్గిన వేళ ఇరాన్ తూర్పు ప్రాంతంలో గగన తలాన్ని తిరిగి తెరిచింది. ఇజ్రాయిల్‌తో 12 రోజుల ఉద్రిక్తల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గగనతలాన్ని తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మాజిద్ అఖావన్ తూర్పు ప్రాంతంలో అంతర్జాతీయ, దేశీయ విమానాల కోసం ఎయిర్ స్పేస్‌ను తిరిగి తెరిచినట్లు తెలిపారు. కానీ, తూర్పు ఇరాన్‌లోని విమానాశ్రయాల నుంచి బయలుదేరే… చేరుకునే విమానాలకు మాత్రమే గగనతలాన్ని తెరిచినట్లు చెప్పారు.


