Homeజిల్లాలుకర్నూలుదివ్యాంగులకు ఉపకరణములు పంపిణీ

దివ్యాంగులకు ఉపకరణములు పంపిణీ

- Advertisement -

పెద్దకడబూరు :పెద్దకడబూరు మండలంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు మండల విద్యా అధికారిణి సువర్ణల సునియం చేతుల మీదుగా ఉపకారణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యా అధికారిని సువర్ణల సునియం మాట్లాడుతూ ట్రై సైకిల్స్, త్రీవీల్ చైర్స్, హియరింగ్ మిషన్స్ ( చెవిటి మిషనులు), రోలేటర్స్, టిఎల్ ఎం కిట్స్ మొదలగు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉపకరణాలను శుభ్రంగా ఉంచుకొని ప్రతిరోజు ఉపయోగించాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు తప్పకుండా హాజరు కావాలని చదువు పట్ల ఇష్టాన్ని పెంచుకొని ఉన్నత చదువులు అభ్యసించి తల్లిదండ్రులకు భారం కాకుండా జీవితాన్ని మలుచుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా దివ్యాంగులను శుభ్రంగా ఉంచాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి విద్యార్థులు ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వీరేష్, ఉపాధ్యాయులు నరసింహులు, కేశవ, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, అకౌంటెంట్ సురేష్ రెడ్డి, సిఆర్పిలు లక్ష్మన్న, కృష్ణచారి, సహిత విద్య ఉపాధ్యాయులు గోపాల్, సుబ్బారాయుడు దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు