Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యం

ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యం

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలందరి ఆరోగ్యమే మా లక్ష్యము అని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్, సివిల్ సర్జన్ గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమావేశ కార్యాలయంలో వైద్యులు, సిబ్బంది సమక్షంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు అని తెలియజేశారు. అనంతరం డాక్టర్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు సకాలంలో వైద్య చికిత్సలను అందించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని, అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఏ సమయంలోనైనా తమ జబ్బు ను తెలిపితే డాక్టర్లచే వైద్య చికిత్సలు అందించబడును అని తెలిపారు. కరోనా సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. వైద్యులు చెప్పే ఆరోగ్య సూత్రాలను ప్రజలు పాటించినప్పుడు చక్కటి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. రోగులకు సేవకులుగా పనిచేస్తున్నామని, రోగ నిర్ధారణతో పాటు వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా ముఖ్యమని తెలిపారు. అనంతరం డాక్టర్ బిధాన్ చంద్ర రాయికు నివాళులర్పించారు. వీరు ప్రజా ఆరోగ్య సంరక్షణలో మార్గదర్శకుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు