Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసర్వేనెంబర్ 650-2 కు న్యాయం చేయండి..

సర్వేనెంబర్ 650-2 కు న్యాయం చేయండి..

- Advertisement -

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్

ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా
ధర్మవరం పట్టణంలో 650-2 సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులకు దక్కాల్సిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యాక్రాంతం చేసి, ఆ భూమిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు అని. ఆ కట్టడాలు వెంటనే తొలగించి, అక్రమార్కుల పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ పుట్టపర్తిలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పూలేశెట్టి రవికుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రం శెట్టి రమణ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఈ సర్వే నెంబర్ పైన అనేక పోరాటాలు సల్పడం జరిగిందని పట్టణంలోని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేకపోవడం దారుణమని తెలిపారు. న్యాయపరంగా ఆ సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మికులకు దక్కాల్సి ఉందని, కొంతమంది అక్రమంగా ఆక్రమించి అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ సర్వే నెంబర్లు వెనివెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, రామకృష్ణ, సుబ్బు, చిన్న, జనార్ధన్, మస్తాన్, బాబావాలి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు