Homeఆంధ్రప్రదేశ్వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

- Advertisement -

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ సతీశ్ శర్మ, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించింది.ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. ఇరువురి వాదనలు విని, మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తాము కేసు మెరిట్స్ తో పాటు, పీటీ వారెంట్స్ లోకి వెళ్లడం లేదని తెలిపింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు