బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దారుణం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మరణించిగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డినట్లు తెలుస్తుంది. పాఠశాలతోపాటు కళాశాల ప్రాంగణంలోని భవనాలపై ఈ విమానం కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పుతున్నారు. మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ శిక్షణ విమానం.. మైల్ స్టోన్ పాఠశాల, కళాశాలల భవనంపై కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ పాఠశాల, కళాశాలల భవనాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నారని తెలుస్తుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.


