Homeజాతీయంబంగాళాఖాతంలో అల్పపీడనం… మరింత బలపడే అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం… మరింత బలపడే అవకాశం

- Advertisement -

: ఐఎండీ అమరావతి విభాగం
ఉత్తర బంగాళాఖాతంలో ఈ ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, దానికి అనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వివరించింది. కాగా, ఈ అల్పపీడనంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అప్ డేట్ ఇచ్చింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు