Homeజిల్లాలుశ్రీ సత్యసాయి"ప్రపంచ మానవాళి మహానేస్తాలు" చిత్రపటం ఆవిష్కరణ

“ప్రపంచ మానవాళి మహానేస్తాలు” చిత్రపటం ఆవిష్కరణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థుల నడుమ సమాజాభివృద్ధి కోసం కొత్త బాటలు వేసిన 102మంది ప్రపంచ మేధావులతో కూడిన వైతాళికుల చిత్రపటాన్నీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. చిత్రపటాన్ని అదే కళాశాలలో పనిచేస్తున్న రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ఎన్.ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ అయిన డా.బి. గోపాల్ నాయక్ బహుకరించారు. ఈ సందర్భంగా కళాశాలప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొల్పే వారే వైతాళికులు. ఈ చిత్ర పటంలోని మహనీయుల చే ప్రేరణ పొంది ప్రతి విద్యార్థి తమ జీవితాలను స్ఫూర్తి దాయకంగా మలచుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆల్బర్ట్ ఐన్ స్టీన్, మహాత్మా గాంధీ, షేక్స్పియర్ , మదర్ థెరీసా, ఆల్బర్ట్ నోబెల్, విన్స్టంట్ చర్చిల్, నేపోలియన్ బోనపార్టీ,రవీంద్రనాథ్ ఠాగూర్, కారల్ మార్క్స్, కన్ఫ్యూషియస్, లెనిన్, పికాసో,కోఫి అన్నన్ … వంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన
కవులు, రచయితలు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సామాజిక, శాస్ర, సాంకేతిక, వైజ్ఞానిక, తత్వ రాజకీయ, క్రీడా, వ్యాపార ,ఆర్థిక ,విద్యావేత్తలతో కూడిన మానవాళి మహానేస్తాలు అని,తదితర 102 మంది ప్రపంచ మేధావులున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
వైస్-ప్రిన్సిపాల్ డా ఎస్. చిట్టెమ్మ,డా.బి.త్రివేణి, డా ఎస్. షమీఉల్లా, డా.బి. గోపాల్ నాయక్,
ఎస్. పావని, హైమవతి, వెంకటలక్ష్మి, తాహిర్ అలీ, బి.ఆనంద్, జి.మీనా, జి.ధనంజయ ,అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు