Homeజిల్లాలుఅనంతపురంలయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:(శ్రీసత్యసాయి) పేద ప్రజల కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు ఆకులేటి రమేష్‌ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్స్‌ క్లబ్‌ వారు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి క్యాంపు దాతగా కీర్తిశేషులు పళ్లెం నాగమ్మ, పళ్లెం శ్రీనివాసులు జ్ఞాపకార్థం వీరి కుమారులు పళ్లెం వేణుగోపాల్‌ వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా లయన్స్‌ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల అధ్యాపకులు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, ముఖ్య వక్తలు పళ్లెం వేణుగోపాల్‌, మోహన్దాస్‌, వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు కంటి వైద్య చికిత్సలను అందిస్తూ వేల సంఖ్యలో ఆపరేషన్లను ఉచితంగా నిర్వహిస్తూ, ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తూ కంటి వెలుగును ప్రసాదించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మా క్లబ్బు కమిటీలు మారినా కూడా మా లక్ష్యం మాత్రం పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమేనని వారు స్పష్టం చేశారు. ఈ శిబిరంలో 73 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 54 మందిని ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మా యొక్క లయన్స్‌ క్లబ్‌ సేవలను వివిధ రూపాలలో కూడా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం శిబిర దాతలను లయన్స్‌ క్లబ్‌ కమిటీ వారు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మెటీకల కుళ్లాయప్ప, ముక్తాపురం కృష్ణ, పుట్లూరు నరసింహులు, రాజగోపాల్‌, హరీష్‌, గోసే రాధాకృష్ణ, కంటి టెక్నీషియన్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు