Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆగస్టు 20 నుండి 25 వరకు ఒంగోలులో ప్రజా కళా ఉత్సవాలు

ఆగస్టు 20 నుండి 25 వరకు ఒంగోలులో ప్రజా కళా ఉత్సవాలు

- Advertisement -

1000 మంది కళాకారులతో, వంద గొంతుకులతో, వంద కళారూపాలతో మార్మోగనున్న ఒంగోలు

  • ప్రజా కళా ఉత్సవాలకు హాజరుకానున్న సినీ, నాటక, సాహితీ ప్రముఖులు
  • ఒంగోలు
  • ఆగస్టు మాసంలో ఒంగోలులో జరగనున్న సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుండి 25 వరకు ప్రజా కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ( అన్న), రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్ర నాయక్, చిన్నం పెంచలయ్య పేర్కొన్నారు. ఈ ప్రజా కళా ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించడం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెయ్యి మంది కళాకారులు, 100 గొంతుకలు నినాదంతో ఈ ప్రజా కళా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రజా కళా ఉత్సవాలకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నుండి తిరుపతి, కర్నూలు తో పాటుగా రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి దాదాపు 1000 మంది కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రజా కళా ఉత్సవాల సందర్భంగా చెక్కభజనలు, తప్పెడు గుండ్లు, గిరిజన నృత్యాలు, ధింసా, గురవయ్యలు, 100 మంది కోలాట కళాకారులు, విచిత్ర వేషాలతో కళాకారులు తమ సందేశాత్మక, అభ్యుదయ ప్రదర్శన ద్వారా ప్రజలకు చైతన్య పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సినీ, నాటక రంగ ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు గోరేటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్, జై రాజ్, మాదాల రవి, తమ్మారెడ్డి భరద్వాజ, బాబ్జి, అజయ్ ఘోష్ వంటి ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ ప్రజా కళా ఉత్సవాలకు ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్ పిచ్చియ్య, ఏ రామారావు, ఎస్ కే నజీర్, వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
  • [5:18 PM, 7/26/2025] Suresh: Ok
  • [5:19 PM, 7/26/2025] Suresh: రాష్ట్ర కార్యదర్శి
  • [5:19 PM, 7/26/2025] Suresh: పై వరసలో రావాలి
  • [5:20 PM, 7/26/2025] Suresh:
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు