విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; ఆగస్టు 15న జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేడుకలను ఎప్పటిలాగే రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వేదిక, సీటింగ్, అతిథుల ఆహ్వానం, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల ఆహ్వానం వంటి అంశాలకు రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యత వహించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేదిక అలంకరణ, తాత్కాలిక టాయిలెట్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, బందోబస్తు ఏర్పాట్లకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై 15 శకటాలను ఏర్పాటు చేయాలని, వీటిలో పి4, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ శకటాలు ప్రత్యేకంగా ఉండాలన్నారు. శకటాల ఏర్పాట్లను పిడి డీఆర్డిఏ, డ్వామా ల ఇన్ఛార్జ్లు సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడటం, జనరేటర్ల ఏర్పాటు కోసం విద్యుత్ సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులలో దేశభక్తి భావనను పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, యాంకర్ ద్వారా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నడిపే బాధ్యత విద్యాశాఖ అధికారి తీసుకోవాలనీ పేర్కొన్నారు. ముఖ్య అతిథి ప్రసంగ పాఠం లో జిల్లా అభివృద్ధి, సంక్షేమ రంగాలపై ముఖ్యమైన నోట్స్‌ను జిల్లా ప్రణాళిక అధికారి, సమాచార పౌర సంబంధాల అధికారి సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. కాలేజ్ ప్రాంగణంలో ఇంటర్నెట్ ఏర్పాట్లు చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు కోసం జీజిహెచ్ సూపరింటెండెంట్, డి ఎమ్ హెచ్ వో లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సౌండ్ సిస్టమ్, మీడియా కోఆర్డినేషన్, లైవ్ కవరేజ్ వంటి అంశాలను పౌర సంబంధాల అధికారి పర్యవేక్షించాలన్నారు. హాజరైన అతిథులకు త్రాగునీరు, స్నాక్స్ అందించేందుకు డి.ఎస్.ఓ, మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టాలన్నారు. గత సంవత్సరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డుల కోసం శాఖాధిపతులు ఈ నెల 31 లోపు పేర్లను ప్రతిపాదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి , ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, పి డి ఆర్ డి ఎ ఎన్వివిఎస్ మూర్తి, డ్వామా పిడి ఎం. నాగమల్లేశ్వర రావు, విద్యుత్ ఎస్సీ టి తిలక్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, డిఎంహెచ్వో కే వెంకటేశ్వరరావు, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, ఐసిడిఎస్ పిడి సిహెచ్. శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బి ఈ ఈ ఎస్బివి రెడ్డి, ఎల్లా మత్స్య శాఖ అధికారి టి. నిర్మల కుమారి, తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి– జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు
- Advertisement -
RELATED ARTICLES


