Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి… ఏపీయూడబ్ల్యూజే

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి… ఏపీయూడబ్ల్యూజే

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి పిలుపు మేరకు డిమాండ్స్‌ డేలో భాగంగా కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్న నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పాతఅక్రిడిటేషన్‌ కార్డులను పొడిగించకుండా కొత్తకార్డులు మంజూరు చేయాలన్నారు.రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీలలో జర్నలిస్టు యూనియన్‌లకు ప్రాతినిథ్యం కల్పించాలని, వర్కింగ్‌ జర్నలిస్టులకు హెల్త్‌స్కీమ్‌ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రమాధభీమా పథకం తక్షణమే అమలు చేయాలని, జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలని, విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పాత్రికేయుల పించన్లను మనరాష్ట్రంలో ప్రారంభించాలని, యాంటీ అటాక్‌ కమిటీలు పునరుద్దరించాలని, రైల్వేపాస్‌లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఓ వెంటనారాయణమ్మకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటసుబ్బయ్య , గౌరవసలహాదారులు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండప్ప,అద్యక్ష కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాసులుగౌడ్‌, నాయకులు శివ, అంజి, అవినాష్‌, సుధాకర్‌, పెద్దఎత్తున పాత్రికేయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు