Homeఆంధ్రప్రదేశ్పెళ్లి ఇష్టo లేక ఒకరు… చీర కొనివ్వలేదని మరొకరు బలవన్మరణం

పెళ్లి ఇష్టo లేక ఒకరు… చీర కొనివ్వలేదని మరొకరు బలవన్మరణం

- Advertisement -

సత్య సాయి జిల్లా లో ఇద్దరు యువతుల ఆత్మహత్య

విశాలాంధ్ర(సోమందేపల్లి/ధర్మవరం)…క్షణకావేశం ఇద్దరి యువతుల బలవన్మరణానికి దారి తీసింది. పెళ్లి ఇష్టం లేదని ఒకరు.. చీర కొనివ్వలేదని మరొకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు శ్రీ సత్య సాయి జిల్లా చోటుచేసుకున్నాయి. సోమందేపల్లి మండల కేంద్రంలో ని మణికంఠ కాలనీకి చెందిన హర్షిత ( 22 ) కర్ణాటకలోని బాగేపల్లి కి చెందిన నాగేంద్ర తో సోమవారం వివాహమైంది. అయితే ఈ పెళ్లి నవవధువుకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అయితే పెళ్లి రోజు మారం చేస్తే ఎలాగని బలవంతంగా తాళికట్టించుకున్నట్లు హర్షిత తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సోమవారం రాత్రి మొదటి రోజు కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తన ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అరగంటసేపు బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా హర్షిత ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున వినిపించారు తల్లిదండ్రులు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ధర్మవరంలో..ధర్మవరంలోని బాలాజీ నగర్ కు చెందిన ఉషారాణి (16 ) స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. కళాశాలలో జరిగే స్నాతకోత్సవానికి కొత్త చీర కావాలని తల్లిదండ్రులను అడిగింది. వారు కొనివ్వలేదని వేదనకు గురై ఇంట్లోనే చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్న ఉషారాణి మంచి మార్కులు సాధించి జూడో లో కూడా రాణిస్తోంది. కళాశాలలో జరిగే కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వాలని ఇంట్లో అడగడంతో వారు ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా సకాలంలో చీర కొనివ్వలేదు. దీంతో మన స్థాపానికి గురై క్షనికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు